పవన్ పర్యటనను అడ్డుకోవడం దుర్మార్గం: పోతిన మహేష్ - Pawan Kalyan tours
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 5:00 PM IST
Jana Sena leader Potina Mahesh allegations on CM Jagan: అధికారం అడ్డుపెట్టుకొని పవన్ కల్యాణ్ పర్యటనలను అడ్డుకోవడం దుర్మార్గమని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీ పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అంటే ఎందుకు అంత భయం అని నిలదీశారు. ఐదు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళ్లే సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ గోదావరి పర్యటనలకు వస్తుంటే ఓటమి భయం పట్టుకుందన్నారు. జగన్ రెడ్డిని అధికారం నుంచి దించే సమయం వచ్చిందని, వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలు కచ్చితంగా బుద్ది చెప్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పర్యటనలను అడ్డుకుంటున్న అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులలో ఏ ఒక్కర్నీ వదిలేది లేదని, అందరికీ తగిన బుద్ది చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే అని అధికారులు గుర్తు పెట్టుకోవాలని పోతిన మహేష్ సూచించారు.