వాలెంటైన్స్ డే ఓ దేశద్రోహి సంస్మరణం అంట! మీకు తెలుసా? - వాలెంటైన్స్ డే పై జన జాగరణ సమితి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 6:54 PM IST
Jana Jagarana Samiti Awareness on Valentine's Day In Visakha : ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అని జరుపుకోవడం సరికాదని జన జాగరణ సమితి కార్యకర్తలు అన్నారు. వాలెంటైన్స్డేపై విశాఖలోని ఎంఆర్ఐ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జన జాగరణ సమితి కార్యకర్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛమైన ప్రేమకు, ప్రేమికులకు, ప్రేమ పెళ్లిళ్లకు జన జాగరణ సమితి వ్యతిరేకం కాదని, ప్రేమికుల రోజు పేరుతో జరిగే విచ్చలవిడితనానికి, నకిలీ ప్రేమికులకు, అమ్మాయిలపై జరిగే హింసకు, మత్తు పదార్థాల వినియోగానికి పూర్తిగా వ్యతిరేకం అని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు అన్నారు.
Valentine's Day : రోమ్ దేశానికి చెందిన దేశద్రోహి సెయింట్ వాలెంటైన్‌ను ఉరి తీసిన రోజును ప్రేమికుల రోజుగా జరుపుకోవాల్సిన గత్యంతరం మన దేశానికి లేదన్నారు. వాలెంటైన్స్ డేను పాకిస్తాన్ అధికారికంగా నిషేధించిందన్నారు. ఇటువంటి పనికిమాలిన దినోత్సవాలు కారణంగా మన దేశంలో పవిత్రమైన వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.