మళ్లీ వానొచ్చింది తిప్పలు తెచ్చింది - ఈ వర్షాకాలం మేం ఊరు దాటేదెలా? - Jampanna Vagu Bridge Damage - JAMPANNA VAGU BRIDGE DAMAGE
🎬 Watch Now: Feature Video


Published : Jul 17, 2024, 12:29 PM IST
Jampanna Vagu Bridge Damaged In Eturunagaram : గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొండాయి పంచాయతీ పరిధిలోని దొడ్ల - మల్యాల గ్రామాల మధ్య ఉన్న జంపన్న వాగుపై నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మల్యాల, కొండాయి, గోవింద రాజు కాలనీ తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత వంతెనకు ఇరువైపులా పైపులు వేసి తాత్కాలిక మట్టిరోడ్లు వేశారు.
అనంతరం ఆయా గ్రామాల రవాణా కష్టాలు తీర్చేందుకు రూ.35 లక్షల వ్యయంతో కూలిన వంతెన స్థానంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు గత నెలలు పనులు ప్రారంభించగా నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉన్న మట్టి రోడ్డు కాస్త వరద ధాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఫుటోవర్ బ్రిడ్జ్ జాయింట్లు ఊడిపోయి ఎప్పుడు కింద పడుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ ఏడాది కూడా తమకు రవాణా కష్టాలు తప్పట్లేదని స్థానికులు వాపోతున్నారు. అత్యవసరమయితే వారికి దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు.