"బౌలింగ్ చేతకాదు, బ్యాటింగ్ చేతకాదు" - వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ - MLA ADINARAYANA CHALLENGE TO JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2024, 4:57 PM IST

MLA Adinarayana Reddy hot Comments on YS Jagan : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు తనకు ఏమాత్రం సరితూగరని అన్నారు. టీడీపీ నేత భూపేశ్ రెడ్డితో కలిసి మెగా జాబ్‌ మేళాను ఆదినారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రామసుబ్బారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి ప్రస్తుతం ఎమ్యెల్సీగా ఉన్నా ఎటువంటి లాభం లేదన్నారు. 

ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. విమర్శించే వాళ్లు బయటికి వచ్చి అభివృద్ధిని చూడాలన్నారు. జగనన్న కాలనీల్లో స్థానిక నాయకులు ఇష్టారీతిన అక్రమాలు చేశారని విమర్శించారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకొని ప్రజల సొమ్మును దోచుకున్నారని తెలిపారు. అన్నింటినీ బయటకు తీస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్నీ హామీలను త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు. సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.