ప్రత్యేక హోదా సాధించటంలో సీఎం జగన్ విఫలమయ్యారు: జేడీ లక్ష్మీనారాయణ - సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 4:27 PM IST
Jai Bharath Party Protest at CM Camp Office : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించింది. సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, జేడీ లక్షీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు. కార్యాలయ ముట్టడికి యత్నించిన నేతలను, యువజన విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు (Police) అరెస్టు చేశారు. రాష్ట్రానికి హోదా అడిగితే అరెస్టులు చేయడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ అన్నారు.
సిద్దం అంటోన్న సీఎం జగన్ అఖిలపక్షాలను దిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి హోదా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఎపీ ఆత్మగౌరవాన్ని దిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. విశాఖ (Visakha) ఉక్కును అమ్నుతుంటే సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.