రాష్ట్రంలో ఫ్యాన్ రివర్స్‌లో తిరుగుతోంది- వైఎస్సార్సీపీపై ఆటో రాంప్రసాద్ పంచ్‌లు - Auto Ramprasad Election Campaign - AUTO RAMPRASAD ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 5:11 PM IST
|Updated : May 9, 2024, 5:24 PM IST
Jabardasth Comedian Auto Ramprasad Election Campaign in Vishaka : ఆడవాళ్ల వల్ల రాజ్యాలే కూలిపోయాయి అన్నది పాత మాట. ప్రస్తుతం ఆడవాళ్లు తలుచుకుంటే ఏ పార్టీ నైనా గెలిపించగలరని జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ అన్నారు. విశాఖపట్నంలో తెలుగు మహిళలు నిర్వహించిన మహిళ శక్తి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా రాంప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాన్ రివర్స్‌లో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. దీనివల్ల గాలి కూడా వేరే దిశకు మారుతుందని చలోక్తులు విసిరారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
మహిళలు తలుచుకుంటే ఎలాంటి పని అయినా సులభంగా చేయగలరని, తెలుగుదేశం పార్టీని గెలిపించడంలో కూడా వారు అలాంటి తెగువనే చూపించాలని వెల్లడించారు. విశాఖ అంటే అందరికి స్టీల్ ప్లాంట్ గుర్తుకువస్తుందని తనకు మాత్రం విశాఖ అంటే గంటా శ్రీనివాసరావు గుర్తొస్తారని తెలిపారు. గంటా లాంటి నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందరూ తనను ఆటో రాంప్రసాద్ అని పిలుస్తారు, కాని ఇకపై సైకిల్ పైనే వస్తానని హాస్యంగా చెబుతూ సభలో నవ్వులు పూయించారు.