వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు- రూ. 25 కోట్ల నగదు, దస్త్రాలు స్వాధీనం - IT Authorities Rides in Mangalagiri - IT AUTHORITIES RIDES IN MANGALAGIRI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 5:54 PM IST
IT Authorities Rides Textile Businessman House in Mangalagiri: పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదాయపన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ దాడిలో సుమారు 25 కోట్ల రూపాయల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ ఒకే ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయలు ఉండటంపై అనుమానం వ్యక్తమవుతోంది.
Seized the 25 Crore Cash AND Documents: అధికారులు పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. పోలింగ్‌కు ఇంకా మూడు రోజులే ఉండటంతో ఓటర్లను రాజకీయ నేతలు ప్రలోభాలకు గురిచేస్తారని అధికారులు ముందుగానే ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. దాడుల్లో పట్టుబడిన నగదుపై ఎలాంటి సరైన ఆధారాలు లేకపోయిన ఆ సొమ్ము మొత్తాన్ని సీజ్ చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ నేత లోకేశ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.