ETV Bharat / state

నకిలీ యాప్​తో సైబర్​ మోసాలు- రైట్​ టిక్​ కనిపించినా నమ్మొద్దు! - CYBER CRIMES IN NTR DISTRICT

దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్‌ ద్వారా డబ్బులు పంపామని చెప్పి తన ఫోన్‌లో ఉంచిన నకిలీ యాప్‌ ద్వారా వాటిని చూపి అక్కడ నుంచి జారుకుంటున్న కేటుగాళ్లు.

cyber_crimes_in_ntr_district
cyber_crimes_in_ntr_district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 9:55 AM IST

Cyber Crimes in NTR District : సైబర్‌ నేరాల్లో ఒక చోట రూ.లక్షలు, మరో చోట రూ.వేలు మోసపోయారని మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే మోసగాళ్ల ఆగడాలు లక్షల్లోనే ఉన్నాయనుకుంటే పొరపాటే. చివరకు చిల్లర రూపాయిల వద్ద కూడా వీరి జిమ్మిక్కులకు అంతులేకుండా పోయింది. పండ్ల దుకాణాలు, టిఫిన్‌ కొట్లు, రద్దీ ఉండే చిల్లర దుకాణాలు సైతం ఈ మాయగాళ్లకు వేదికలయ్యాయి.

కొంత మొత్తంలో కొనుగోలు చేస్తూ దుకాణదారుడు బిజీగా ఉన్న సమయంలో స్కానర్‌ ద్వారా డబ్బులు పంపామని చెప్పి తన ఫోన్‌లో ఉంచిన నకిలీ యాప్‌ ద్వారా వాటిని చూపి అక్కడ నుంచి జారుకుంటున్నారు. ఇటువంటి మోసాలు పురపాలికలో కొన్ని రోజులుగా సాగుతున్నాయి. దుకాణదారులు విరివిరిగా వాడే నగదు బదిలీ చేసే నకిలీ యాప్‌లు విపరీతంగా వచ్చాయి. వీటి సాయంతో చెలరేగిన మోసగాళ్లు, ఆకతాయిలు తమ విన్యాసాలను చూపిస్తూ చిరు వ్యాపారులను మోసం చేస్తున్నారు.

  • ఇబ్రహీంపట్నం రింగుకూడలిలోని ఓ పండ్ల దుకాణం వద్ద రూ.120తో యాపిల్‌ పండ్లు కొనుగోలు చేసిన యువకుడు అక్కడున్న స్కానర్‌తో తన చరవాణిలో నుంచి నగదును పంపినట్లు దుకాణదారుడికి చూపాడు. సాయంత్రానికి పండ్ల దుకాణ యాజమాని ఫోన్‌ చూసుకోగా రూ.120 వచ్చినట్లు కనిపించలేదు. ఎంత సేపు ఆలోచించినా నగదు ఎందుకు రాలేదో అర్థంకాక అయోమయానికి గురయ్యాడు.
  • కొండపల్లిలోని ఓ పచారీ దుకాణం వద్దకు వెళ్లిన ఓ యువకుడు రూ.400లకు సరుకులు కొనుగోలు చేశాడు. తన చరవాణి నుంచి అక్కడ ఉన్న స్కానర్‌కు ఆ నగదును పంపినట్లు తన ఫోన్‌లో దుకాణ యాజమానికి చూపాడు. ఆ సమయంలో స్కానర్‌ శబ్ద యంత్రం మోగలేదు. తర్వాత వస్తుందిలే అని వదిలేశాడు. అనుమానం వచ్చి అదే రోజు రాత్రి తిరిగి తన ఫోన్‌పే ఖాతాను సరిచూసుకోగా యువకుడు పంపిన రూ.400 రాలేదు. దీంతో మోసపోయానని లబోదిబోమన్నాడు.

డిజిటల్‌ అరెస్టు - రూ.60లక్షలను కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఇదీ ప్రక్రియ : దుకాణదారుని వద్ద ఉన్న స్కానర్‌కు చరవాణి స్కానర్‌తో నగదు పంపిన తరువాత కొనుగోలుదారుడి చరవాణిలో టిక్‌ మార్క్‌ కనిపిస్తుంది. అదే సమయంలో దుకాణదారుడి వద్ద సమాచార సందేశ శబ్ద యంత్రం ఉంటే అది తెలియజేస్తుంది. అలా జరిగితే నగదు బదిలీ అయినట్లు నిర్ధారణ.

ఇలా జరుగుతుంది : తమ వద్ద ఉన్న నకిలీ యాప్‌లతో రద్దీగా ఉన్న దుకాణాల వద్దకు వచ్చిన మోసగాళ్లు నగదు పంపినట్లుగా టిక్‌ మార్కులు చూపిస్తున్నారు. దుకాణదారుడు రాలేదని ప్రశ్నిస్తే రాలేదా అని అప్పుడు నగదు పంపిస్తున్నారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. శబ్దం తర్వాత వినిపిస్తుందిలే అనుకొన్నా.. మోసపోయినట్లే.. గమనించండి.

'నగదు బదిలీ చేసే ప్రైవేటు యాప్‌లతో అనేక మోసాలు గతంలో జరిగాయి. అనేక విధాలుగా ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటి పట్ల ఆయా దుకాణదారులు అప్రమత్తంగా ఉండాలి. నగదు తమకు అందాయా లేదా అన్నది వెంటనే ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.' -సైబర్‌ క్రైమ్‌ సీఐ గుణరామ్‌

అన్ని కోణాల్లోనూ పొంచి ఉన్న ముప్పు - లింకులు ఓపెన్ చేసేముందు ఆలోచించాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.