చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవం - వైఎస్సార్సీపీ బాధితులకు టీడీపీ ఆహ్వానాలు - AKBAR FAMILY INVITATION CBN OATH - AKBAR FAMILY INVITATION CBN OATH
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 5:35 PM IST
Interview With YSRCP Victim Akbar Basha Family: వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాలతో విసిగిపోయిన అక్బర్ బాషా కుటుంబానికి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం అందింది. ఈ వేడుకకు హాజరు కావాలంటూ అక్బర్ బాషాకు టీడీపీ ఆహ్వానం పంపించింది. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో ఎకరా స్థలాన్ని వైఎస్సార్సీపీ నేత తిరుపాల్ రెడ్డి ఆక్రమించారని అక్బర్ బాషా కుటుంబం పోరాటం చేస్తోంది.
ఎకరా స్థలాన్ని వైఎస్సార్సీపీ నేతలు కబంధ హస్తాల నుంచి కాపాడాలని వేడుకున్నా ఎవరూ న్యాయం చేయక పోవడంతో 2021 సెప్టెంబరులో అక్బర్ బాషా కుటుంబం పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పట్లో సీఎంవో కార్యాలయం నుంచి విచారణ చేయాలని ఆదేశాలు వచ్చినా వైఎస్సార్సీపీ నేతలు పట్టించుకోలేదని బాధితుడు తెలిపారు. ఆ భూమిలోకి అడుగుపెడితే చంపేస్తామంటున్నారని బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది. చంద్రబాబు హయాంలో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందంటున్న అక్బర్ బాషాతో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి నిర్వహించారు.