విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వాహణ- క్షేత్రస్ధాయిలో సమస్యలకు పరిష్కారిస్తాం: టీటీడీ ఈవో
🎬 Watch Now: Feature Video
TTD EO Shyamala Rao on Tirumala Brahmotsavams: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి మహారథోత్సవాలు వైభవంగా జరిగాయి. పోలీసులు, టీటీడీ సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సాధారణ భక్తులు సంతృప్తి స్ధాయిలో వాహన సేవలో ఉత్సవ మూర్తులను, మూల విరాటును దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశామని శ్యామలరావు తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. 9 రోజుల పాటు భక్తులకు సేవలందించడంలో భాగంగా క్షేత్రస్ధాయి పర్యటనలతో కొన్ని సమస్యలు గుర్తించామని రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యేలా సూక్ష్మస్ధాయి ప్రణాళికలు రూపొందించి అమలు చేశామంటుని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
ధ్వజావరోహణంతో ముగింపు: కాగా ఈ రోజు శ్రీవారికి వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం పుష్కరిణిలో అర్చకులు ఈ క్రతువును పూర్తి చేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.