ఓటర్లందరూ తప్పనిసరిగా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలి : సీఈవో వికాస్‌రాజ్ - CEO Vikas Raj Interview
🎬 Watch Now: Feature Video
CEO Vikas Raj Interview on Parliament Elections 2024 : సోమవారం జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన నిఘా భద్రతల మధ్య ఈవీఎంల పంపిణీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని సీఈవో కోరారు. రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈవీఎంలలో ఎటువంటి సమస్యలు వచ్చినా, సంబంధిత అధికారులు పరిష్కరించనున్నట్లు వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ శాతం పెరిగేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్ స్లిప్ రానట్లయితే మొబైల్ యాప్ ద్వారా, ఈసీ వెబ్‌సైట్ ద్వారా, ఫోన్ నుంచి 1950కి మెసెజ్ చేసి పొందవచ్చని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు.