అన్యాయం, అణచివేతపై పోరాడుతూనే ఉంటా: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ - IPS ABV INTERVIEW - IPS ABV INTERVIEW
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-06-2024/640-480-21610593-thumbnail-16x9-interview-with-former-ips-abv.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 1, 2024, 3:55 PM IST
With Former IPS Officer AB Venkateswara Rao: అసత్య ఆరోపణలతో తనను తీవ్రంగా వేధించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆరోపణలను నిరూపించకుండా ఇన్నేళ్లూ కక్షసాధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. తప్పు చేయలేదు కాబట్టే ఆలస్యమైనా తనకు న్యాయమే జరిగిందన్నారు. వృత్తిరీత్యా పదవీ విరమణ చేసినా అన్యాయం, అణచివేత ఎదుర్కొనేందుకు పోరాడుతూనే ఉంటానని అంటున్నారు. తనపై చేసిన ఆరోపణలు, మోపిన అభియోగాలకు ఒక్క ఆధారం కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదని అన్నారు. న్యాయం ఆలస్యం కావొచ్చు- కానీ తప్పకుండా జరుగుతుందని విశ్వసించినట్లు తెలిపారు. ఒంటరిగా పోరాడుతున్నాననే భావన ఎక్కడా కనిపించని రీతిలో పౌరసమాజం స్పందించిందని తెలిపారు. 2019 నుంచి పరిపాలన విధానంలో స్పష్టమైన మార్పు కనిపించిందని అన్నారు. ఏ ఉద్యోగం సంఘం కూడా గొంతెత్తలేని స్థితిలో ఉన్నందునే ఐపీఎస్ అధికారుల సంఘం కూడా తన విషయంలో స్పందించి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తాను ఎప్పుడూ సమాజ హితం కోసం పని చేస్తానని తన శేష జీవితంలో సైతం ప్రజలు, సమాజం కోసం స్పందిస్తూ ఉంటానని ఏబీవీ తెలిపారు.