అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మాతృభాషా దినోత్సవం - International Mother Language Day
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 10:43 PM IST
International Mother Language Day celebration : ప్రాథమిక విద్య మాతృభాషలో నేర్పినప్పుడే భాషను పరిరక్షించుకోగలమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీక్షేత్రంలో దివిసీమ సాహితి సమితి అధ్యక్షులు గుడిసేవ విష్ణు ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ద ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యునెస్కో మన జాతీయ విద్యా విధానం ప్రాథమిక విద్య మాతృభాషలో చెప్పాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
అయినప్పటికీ మాతృభాషలో బోధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమని అన్నారు. తద్వారా పిల్లలు తమ పేర్లు కూడా తెలుగులో రాయలేని పరిస్దితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల భాషా పరిరక్షణ ఏవిధంగా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు. భాష నశిస్తే జాతి నశిస్తుందని, ఈ సత్యాన్ని తెలుగు వారు గుర్తించాలని బుద్ద ప్రసాద్ కోరారు. జాతి అభిమానాన్ని, భాషాభిమానాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే తెలుగు జాతి ప్రకాశిస్తుందని పేర్కొన్నారు.