ఎన్నికల ప్రధానాధికారి సూచనలు- పోలింగ్ కేంద్రాలకు నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశం - Polling Centers Network Facility

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 10:22 AM IST

Instructions Of AP Additional Chief Electoral Officer At The Time Of Election: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలకు నెట్వర్క్ సౌకర్యాన్ని (Network facility) కల్పించాలని ఏపీ అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఎం.ఎన్ హరేంథిర ప్రసాద్ టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 46 వేల 165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్టు హరేంథిర ప్రసాద్ తెలిపారు. 

Electoral Officer Order to Provide Network Facility to Polling Centers: యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ విధులను వినియోగిస్తూ షాడో ఏరియాలోని 689 పోలింగ్ స్టేషన్లకు టవర్ల సౌకర్యాన్ని కల్పించే పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు బల్క్ ఎస్​ఎమ్​ఎస్ (SMS) ద్వారా చేయనున్న ప్రచారానికి ఎంసీసీ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని హరేంథిర ప్రసాద్ స్పష్టం చేశారు. దీనికోసం అయ్యే వ్యయాన్ని అభ్యర్ధుల వ్యయంలోనే చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా నిరంతరాయంగా నెట్వర్క్ సేవలు అందించాల్సిందిగా సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.