విశాఖలో భారత్‌ – ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్ - ప్రారంభమైన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు - India England Test Match

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 1:50 PM IST

India England Test Match in AP : విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్‌ – ఇంగ్లాండ్‌ రెండవ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరుగనుంది. ​ఈ మ్యాచ్​కి సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. వీటిని విశాఖలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విక్రయాలు జరుగుతాయి. అయితే  జనవరి 15వ తేదీ నుంచే ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ఆరంభమయ్యాయి. మ్యాచ్​ను వీక్షించేేందుకు రోజుకు 2,850 మంది క్లబ్‌ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ ఉంటుందని ఏసీఏ (ACA) కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే రోజుకు 2 వేల మంది విద్యార్థులకు ఉచిత ఎంట్రీ ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు ఐడీ కార్డులు తప్పనిసరని వెల్లడించారు.

ఆఫ్‌లైన్‌ టికెట్ల ధరల వివరాలు..  

రోజుకు రూ.100+సీజన్‌కు రూ.400      

రోజుకు రూ.200+సీజన్‌కు రూ.800    

రోజుకు రూ.300+సీజన్‌కు రూ.1,000    

రోజుకు రూ.500+సీజన్‌కు రూ.1,500  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.