LIVE: ఇండియా కూటమి పార్టీలతో కలిసి వైఎస్ షర్మిల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - India Alliance Press Meet Live - INDIA ALLIANCE PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 21, 2024, 12:26 PM IST
|Updated : Mar 21, 2024, 1:34 PM IST
India Alliance Parties Press Meet Live: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన ఆ పార్టీ ఈ నెల 25 తేదీన ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించనుంది. ప్రధానంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఏఐసీసీ నుంచి ఆమెకు సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ-వైసీపీ వేర్వేరు కావంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఖండించారు. ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యే వరకూ జగన్తో స్నేహం చేసిందెవరని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో సీఏఏ, వ్యవసాయ, ఆర్టీఐ బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు జగన్ పార్టీ ఎంపీల మద్దతు తీసుకున్నదెవరని నిలదీశారు. ఏపీ హక్కుల కోసం పోరాటం చేసేది, ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఇండియా కూటమి పార్టీలతో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Mar 21, 2024, 1:34 PM IST