కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు- ప్రొక్లైన్లతో నదీగర్భానికి తూట్లు - Illegal Sand Mining
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 7:08 PM IST
Illegal Sand Mining in Krishna River: కృష్ణాజిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద నిబంధనలకు విరుద్ధంగా గత నాలుగురోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జీసీకేసీ ప్రాజెక్ట్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది ఇసుక బిల్లులు చూపిస్తూ ఇసుకను తవ్వేస్తున్నారు. అనుమతుల ప్రకారం కృష్ణానదిలో కేవలం కూలీలతో మాత్రమే ఇసుక లోడింగ్ చేసుకోవాలి. అయితే నిబంధనలను బేఖాతరు చేస్తూ నాలుగు భారీ ప్రొక్లైన్లతో రాత్రి, పగలు తేడా లేకుండా సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతు వరకూ కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.
దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇసుక తవ్వకాల వలన అటు గుంటూరు జిల్లా, ఇటు కృష్ణాజిల్లా పరిధిలో చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంటల సాగుకు బోర్లలో నీరు రావడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు తగిన చర్యలు చేపట్టి సదరు ప్రొక్లైన్లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.