రాజధాని ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు - లారీలను అడ్డుకున్న రైతులు - Illegal sand mining in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 12:44 PM IST
Illegal Excavation of Soil in Capital Area: పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక, మట్టి తవ్వకాలు జరపొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే బాద్యులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించింది. అయినా అధికార పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోకుండా యథేచ్చగా మట్టిని తవ్వేస్తున్నారు. తాజాగా రాజధానిలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో అక్రమ మట్టి తవ్వకాలు (Illegal soil mining in AP ) కొనసాగుతూనే ఉన్నాయి. తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి కృష్ణయ్యపాలెం వెళ్లే దారిలో రైతులు సీఆర్డీఏకి ఇచ్చిన స్థలంలో అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారు జామున లారీలో మట్టి తరలిస్తుండగా వెంకటపాలెం రైతులు అడ్డుకున్నారు. లారీని పోలీసులకు అప్పగించారు. గతవారం ఇదే ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీని అక్కడే ఉన్న జెసీబీని పోలీసులకు అప్పగించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతామని రైతులు హెచ్చరించారు.