అన్నమయ్య జిల్లా కలెక్టర్​పై సస్పెన్షన్​ వేటు - Fake votes Allegations AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2024, 11:05 PM IST

Updated : Jan 19, 2024, 11:14 PM IST

IAS Officer Girisha Suspended: ఎన్నికల సంఘం నియమాలను కాదని ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ పూనుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటరు జాబితాలో అవకతవకలు, దొంగ ఓట్ల చేర్పులు, ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 

సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడను వదిలి వెళ్లొద్దని గిరీషాను ఆదేశించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో ఆర్వోగా గిరీషా వ్యవహరించారు. ఎపిక్ కార్డుల డౌన్​లోడ్ వ్యవహరంలో, గిరీషా లాగిన్ దుర్వినియోగం చేశారని అభియోగం నమోదైంది. మరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో నిష్పాక్షతపాతంగా వ్యవహరించాలనే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించలేదని అభియోగం గిరీషాపై ఉంది. గిరీషా లాగిన్​ ద్వారా దొంగ ఓట్లు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
 

Last Updated : Jan 19, 2024, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.