రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు - Heavy Rain In Telangana - HEAVY RAIN IN TELANGANA
🎬 Watch Now: Feature Video
Published : Jul 19, 2024, 7:02 PM IST
Hyderabad IMD Director Nagarathna Interview : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయువు బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో ఒడిశా తీరం వెంబడి తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. వాయుగుండం ప్రభావం వల్ల ఇవాళ, రేపు రాష్ట్రంలో విస్తారంగ వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని డాక్టర్ నాగరత్న తెలిపారు.
Heavy Rain Alert To Telangana : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.