thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 5:01 PM IST

ETV Bharat / Videos

రాముడిపై బాలుడి భక్తిభావం - 500 రుబిక్స్​తో శ్రీరాముని నమూనా

Hyderabad Boy Made Lord Sri Ram Portrait With Rubic Cubes : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్​కు చెందిన బాల కళాకారుడు 11ఏళ్ల హృదయ్ పటేల్​​ శ్రీరాముని పజిల్​ (రుబిక్​ క్యూబ్​)ను రూపొందించాడు. శ్రీరాముని ప్రతిబింబం విశేషంగా ఆకట్టుకుంది. బేగంపేట రసూల్​పురాలోని స్వామి నారాయణ దేవాలయంలో ప్రత్యేకంగా క్యూబ్స్​తో ఏర్పాటు చేసిన శ్రీరాముడి చిత్రపట భక్తులకు కనువిందు చేసింది. 

శ్రీరాముడిపై భక్తితో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యాన్ని పురస్కరించుకొని శ్రీరాముని ఆకృతిని రూపొందించినట్లు హృదయ్ పటేల్​ తెలిపాడు. ఐదు అడుగుల శ్రీరామ మూర్తి ఫ్రేమ్ తయారు చేయడానికి 500 క్యూబ్​లు ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. తన గురువైన మానస సరోరాడ్​, స్వామి నారాయణ ప్రతిబింబ ఆకృతులను కూడా తయారు చేసినట్టు వెల్లడించారు. భగవంతునిపై ఈ ఆలోచన విధానం, ఆధ్యాత్మిక భక్తి భావానికి తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని బాల కళాకారుడు హృదయ్ అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.