LIVE : మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ - Huzurabad KTR Road Show Live - HUZURABAD KTR ROAD SHOW LIVE
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 1:12 PM IST
|Updated : May 11, 2024, 1:32 PM IST
Huzurabad KTR Road Show Live : మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు హుజూరాబాద్‌లో మాట్లాడిన ఆయన 'ఐదేళ్లలో బండి సంజయ్ గల్లీలో, దిల్లీలో ఎక్కడైనా కనిపించారా? కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ కేంద్ర నిధులు తీసుకువచ్చారా?. వినోద్.. ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పాడు. కేసీఆర్ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో గమనించాలి. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరుతున్నా. ఆరు గ్యారంటీల హామీలు నెరవేర్చారా?. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాలి. పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు రావాలి. అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్క పనైనా చేశారా?. కేంద్ర నిధలు రాబట్టే సత్తా వినోద్‌కు ఉంది. మోదీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 34 శాతం ధరలు పెంచారు. ముడిచమురు ధరలు తగ్గినా పెట్రో ధరలు మాత్రం తగ్గలేదు. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది' కేటీఆర్ అన్నారు.
Last Updated : May 11, 2024, 1:32 PM IST