రైలు నుంచి జారిపడిన భార్య - రక్షించబోయి భర్త మృతి - MAN DIED IN TRAIN ACCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 10:52 AM IST

Husband Died Saving his Wife in Nandyala District : నంద్యాల జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో ఫుట్‌ఫాత్‌ వద్ద అస్యభాను, సయ్యద్‌ ఆసిఫ్‌ అనే భార్యాభర్తలు కూర్చున్నారు. ఎర్రగుంట్ల వద్దకు వచ్చేసరికి నిద్రమత్తులో ఉన్న భార్య ప్రమాదవశాత్తు రైల్లో నుంచి కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన భర్త ఆసిఫ్‌ రైలులో నుంచి దూకాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ట్రైన్‌ను ఆపించారు. తర్వాత వెనక్కి వెళ్లి చూడగా భర్త మృతి చెందాడు.

అయితే తీవ్ర గాయాలైన అస్యభానును స్థానికులు ఆటోలో డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త మృతదేహాన్ని కూడా రైల్వే పోలీసులు డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అక్కడ విషయం బయటపడింది. మృతులు కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చిరూరు ప్రాంతానికి చెందినవారుగా రైల్వే పోలీసులు గుర్తించారు. వీరు గత నాలుగు నెలల కింద ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రైలులో గుంటూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్నట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.