దారికాచిన మృత్యువు అంటే ఇదేనేమో - దంపతులపై కూలిన చెట్టు - భర్త మృతి - MAN DIED AFTER TREE FALLS ON HIM - MAN DIED AFTER TREE FALLS ON HIM
🎬 Watch Now: Feature Video
Published : May 21, 2024, 1:51 PM IST
Man Dies after Tree Falls On Him in Cantonment Hospital : హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై ప్రమాదవశాత్తు భారీ వృక్షం విరిగి పడడంతో భర్త రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు. భార్య సరళా దేవికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళe దేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tree Fell Down on Man CCTV Footage Video : ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు అందరిని కలిచి వేశాయి. ఈ ఘటనతో ఆసుపత్రికి వచ్చిన వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భార్య మోకాళ్ల చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన భర్తను చెట్టురూపంలో మృత్యువు కబళించిందని అక్కడున్న పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.