నేడే మృగశిర కార్తె - ఈరోజు తప్పక చేపలు తినాలట - అందుకే ఫిష్ మార్కెట్లలో కిటకిట - Mrigashira Karthe 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 11:48 AM IST
Huge Rush At Ramnagar Fish Market in Hyderabad : మృగశిర కార్తె అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది చేపలు. చాలా మంది ఈ జనరేషన్ వాళ్లకు మృగశిర కార్తె అంటే చేపలు తినాలంటారు. ఎందుకంటే? వేసవి ముగియనుండడంతో తెలుగు రాష్ట్రల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వాతావరణం మార్పుల కారణంగా శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. అందుకు మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినడం వల్ల ఎలాంటి జబ్బులు రావని మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. ఈ రోజు చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు మంచిదని అంటున్నారు.
కాగా ఈ రోజు మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లోని పలు చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. మృగశిర రోజు కావడంతో హైదరాబాద్లోని పలు చేపల మార్కెట్లకు ప్రజలు పోటెత్తారు. ఈరోజు చేపలు విక్రయాలు భారీగా ఉంటాయన్న నేపథ్యంలో రాష్ట్రంలోని మహబూబ్నగర్, నల్గొండ, తదితర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి చేపలు వచ్చాయి. మృగశిర కార్తె సందర్భంగా కేజీ కొరమీను రూ.600 నుంచి రూ.800లకు అమ్ముతున్నారు. ఇతర చేపలు కూడా 100, 200, 300 రూపాయలకు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ప్రజలకు అందుబాటు ధరలోనే చేపలు ఉన్నాయని కొనుగోలుదారులు తెలిపారు.