వాహనదారుల కోసం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్స్ - ఎండల నుంచి ఉపశమనం - HMDA Green Mats at Traffic Signals - HMDA GREEN MATS AT TRAFFIC SIGNALS
🎬 Watch Now: Feature Video
Published : May 22, 2024, 5:37 PM IST
Green Mats at Traffic Signals in Hyderabad : వేసవి కాలం అవ్వడంతో భాగ్యనగరంలో ఎండలు మండిపోతున్నాయి. బయటకి వెళ్లాలంటే పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. అందులోను మధ్యాహ్నం బయటకి వెళ్లాలంటేనే భయమేస్తోంది. జాగ్రత్తలు పాటిస్తూ తప్పనిసరి పరిస్థితులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరైతే చెప్పక్కర్లేదు. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సిగ్నల్ పడేంత వరకు ఎండలో ఉంటాలంటే సాహసమనే చెప్పాలి. అందువల్ల వీరి కోసం ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రయోగాత్మకంగా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్స్ను ఏర్పాటు చేసింది.
Uses OF Green Mats at Traffic Signals : కొన్ని కూడళ్లలో నీడ వచ్చేలా గ్రీన్ మ్యాట్స్ను ఏర్పాటు చేయడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనదారులు ఎంచక్కా సిగ్నల్ పడేంత వరకు నీడలో సేద తీరుతున్నారు. మరికొంత మంది ఏప్రిల్ మొదటి వారంలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి ఉంటే మరింత బాగుండేదని చెబుతున్నారు. ఎక్కువ ట్రాఫిక్ వల్ల సిగ్నల్ దగ్గర 2-3 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోందని ఈ గ్రీన్ మ్యాట్స్ వల్ల కాస్త నీడ దొరుకుతుందని తెలిపారు. ఇవి అన్ని కూడళ్లలో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.