ఇక దబిడి దిబిడే - ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి బాలకృష్ణ - Balakrishna Election campaign - BALAKRISHNA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 3:58 PM IST
Balakrishna Election Campaign : టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన రాయలసీమ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి కాగా కదిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. రాయలసీమలో రేపటి నుంచి విస్తృతంగా పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో కదిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న బాలకృష్ణ ఈ నెల 19న హిందూపురంలో నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో ప్రచారం చేయనున్నారు.
హ్యాట్రిక్ విజయాల దిశగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీల కతీతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలను సైతం కొనసాగిస్తున్నారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభల్లో బిజీగా ఉన్నారు. రాయలసీమ పర్యటన అనంతరం ఉత్తరాంధ్రలో బాలకృష్ణ ప్రచారం ఉంటుంది.