అయ్యో నాగయ్యా! కూలీ ఇంటికి లక్ష రూపాయల కరెంటు బిల్లు - విద్యుత్ సరఫరా సమస్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 3:59 PM IST

High Current Bill to Poor Man In Andhra Pradesh : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడానికి చెందిన నాగయ్య కూలి పని చేసుకుంటూ గతంలో ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంట్లో నివసిస్తున్నాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల్లో కరెంటు బిల్లు రావడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే లోపాన్ని సరి చేయాల్సిన అధికారులు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని నాగయ్య వాపోతున్నాడు. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా ఉండేందుకు మెుదట 15 వేల రూపాయలు, తర్వాత 10 వేలు చివరికి 5 వేల రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు అసహనం వ్యక్తం చేశాడు.

Current Bill Problems In Eluru District : బాధితుడు అంత డబ్బు చెల్లించలేనని అధికారులతో మెురపెట్టుకున్నాడు. దీంతో తాను ఇంట్లో లేని సమయంలో అధికారులు మీటరు, వైర్లు తీసుకెళ్లిపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు తనని డబ్బులు ఇవ్వమనడం తగదని నాగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.