అనంతపురం జిల్లాలో భారీ వర్షం - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - Heavy Rains in Anantapur District - HEAVY RAINS IN ANANTAPUR DISTRICT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 11:58 AM IST

Heavy Rains in Anantapur District : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలోని గుత్తి, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, కళ్యాణదుర్గం మండలాల్లోని కుండపోత వానలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలోని ప్రధాన రోడ్లపైన, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వర్షపునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుత్తి మున్సిపల్‌, వ్యవసాయ కార్యాలయం, బాలుర వసతి గృహాల్లోకి వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. దీంతో కార్యాలయాల్లోకి వెళ్లలేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. 

అనంతపురం జిల్లాలోని ఉండబండ, ఆర్.కొట్టాల, పెంచులపాడు, ఛాయాపురం, బేతాపల్లి, తొండపాడు, జక్కలచెరువు గ్రామాల్లోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బూదగవి వంక మరువ పారుతోంది. బేతాపల్లిలో పెద్దవంక ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుడడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కళ్యాణదుర్గంలోని ముదిగల్లు గ్రామంలో చెరువు నిండి ఉద్యానపంటలు భారీగా దెబ్బతిన్నాయి. తమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.