ఆదోనిలో భారీ వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Heavy Rains In Kurnool District - HEAVY RAINS IN KURNOOL DISTRICT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2024/640-480-22607251-thumbnail-16x9-heavyrains.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 6:59 PM IST
Heavy Rains In Kurnool District: కర్నూలు జిల్లా ఆదోనిలో అధిక మోతాదులో వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీటితో పాటు ప్రధాన రహదారులు పూర్తిగా నీటితో నిండాయి. వర్ష ప్రభావానికి వాహనాలన్నీ నిలిచిపోయాయి.
వర్ష తీవ్రతకు వాహన, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి సమీపాన మున్సిపలిటీ పరిధిలో గల మెయిన్ రోడ్, శ్రీనివాస్ భవన్ కూడలి, కోట్ల కూడళ్లలో మోకాళ్ల లోతున వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు లంగర్ బావి వీధి, హవన్నపేట, కౌడల్ పేట్ వీధులలో ఇళ్లలోకి నీరు చేరి పూర్తిగా సామగ్రి తడిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు అన్నీ కాసేపటి వరకు వరదలలో చిక్కుకున్నాయి. రహదారులకు ఇరువైపులా చిన్నపాటి తోపుడు బళ్లతో బతుకు జీవనాన్ని సాగించే సామాన్య ప్రజలు వాన తాకిడికి కొన్ని అవస్థలు పడ్డారు. గాలులకు కరెంటు కోత విధించారు.