మూసీకి వరదొచ్చింది - యాదాద్రిజిల్లాలో రాకపోకలకు బ్రేక్ పడింది - Heavy Flood To Yadadri Musi River

🎬 Watch Now: Feature Video

thumbnail

Heavy Flood Water To Yadadri Musi River : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్యలో లెవల్ బ్రిడ్జి మీద నుంచి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి, హైదరాబాద్​ మూసీ నది నుంచి వస్తున్న వరద కారణంగా భారీగా ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం యాదగిరిగుట్టలో 17 సెంటీమీటర్లు, భువనగిరిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం కారణంగా మూసీకి వరద పోటెత్తింది. దీంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

మరోవైపు మూసీ నది వరద ఉద్ధృతి కారణంగా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపాన ఉన్న బీమలింగం వద్ద లో లెవల్ వంతెనపై నుంచి మూసీ నది వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జికి ఇరువైపులా ప్రయాణికులు, స్థానికులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు ఆ మార్గంలో వాహనదారులు ప్రయాణించకూడదని పోలీసులు సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.