కోళ్ల ఫారాలను ముంచెత్తిన వరద - 50 వేల కోళ్లు మృతి - భారీగా నష్టం - HENS DEAD IN FLOOD EFFECT - HENS DEAD IN FLOOD EFFECT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 9:38 PM IST
Heavy Damage Due to Flood in Poultry Farm : కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో పల్నాడు జిల్లా పల్లెలను వరద ముంచెత్తింది. రెండు రోజులుగా గ్రామాలు జలదిగ్భంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాల పంటలు చెరువులను తలపిస్తున్నాయి. అమరావతి మండలం పెద్దమద్దూరులో కోళ్ల ఫారాలను వరద ముంచెత్తడంతో 50 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దాదాపు 60 లక్షల రూపాయల నష్టపోయామని పౌల్ట్రీ యజమానులు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయి వరద చూడలేదని, ఎప్పుడు వరదలు వచ్చినా కొంత మేరకు నష్టం జరిగేదని కోళ్ల ఫారం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం వరద ఒక్కసారిగా కోళ్ల ఫారంలోకి రావటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. మూడు పక్కల నీరు మరో వైపు కొండ ఉండటంతో ఎటు వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని యజమానులు చెప్పారు. వరద ఉద్ధృతికి ఒక్క కోడి కూడా బతకలేదని, భారీ నష్టం జరిగిందని యజమానులు చెబుతున్నారు. ఫారంలో నిలిచిపోయిన నీటిని బయటకు తరలిస్తున్నామని వారు తెలిపారు. వరద దాటికి మూడు రోజుల నుంచి కోళ్ల ఫారంలో పనిచేసే 20 మందికి నిద్రలేదని యజమానులు పేర్కొన్నారు.