LIVE : బీఆర్ఎస్ నేత హరీశ్​రావు మీడియా సమావేశం - Harish Rao Pressmeet Live - HARISH RAO PRESSMEET LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 2:22 PM IST

Updated : Jul 16, 2024, 2:44 PM IST

BRS Harish Rao Press meet at Assembly Media Point : రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వడపోతల పైనే ఎక్కువగా దృష్టి పెట్టిందన్న విషయం స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఆక్షేపించారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందని వ్యాఖ్యానించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికమని ప్రకటించడమంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని హరీశ్​ రావు వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారని, అధికారం చేజిక్కిన తర్వాత ఆంక్షలు పెట్టారని అన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Last Updated : Jul 16, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.