LIVE: ఖమ్మం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు - Harish Rao live - HARISH RAO LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 24, 2024, 4:12 PM IST
|Updated : Apr 24, 2024, 4:32 PM IST
Harish Rao Live : అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటూ అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయన్న ఆయన, 100 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మహిళలకు హామీ ఇచ్చిన రూ.10 వేలు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ వద్దంటూ గన్ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, ఆయన ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ ఇచ్చినట్లు చెబుతున్నారని ఆక్షేపించారు. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ, ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ నిలదీశారు. తాజాగా ఖమ్మంలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి హరీశ్‌రావు హాజరై మాట్లాడుతున్నారు.
Last Updated : Apr 24, 2024, 4:32 PM IST