జీవీఎంసీ అధికారుల అత్యుత్సాహం - సమాధానమిస్తేనే జీతమని హెచ్చరిక - సచివాలయ ఉద్యోగులకు నోటీసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 6:06 PM IST

GVMC Show Cause Notice to Sachivalayam Employees: విశాఖలో జీవీఎంసీ (Greater Vizag Municipal Coorporation) అధికారులు సచివాలయ ఉద్యోగుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల (Government programs) పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని 92 మంది సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20లోగా వివరణ ఇవ్వాలని లేకపోతే ఈ నెల జీతం నిలిపివేస్తామని అధికారులు బెదిరించారు. 

షోకాజ్ నోటీస్​కు సమాధానం సంతృప్తికరంగా లేకపోతే మార్చి నెల జీతం నిలుపుదలతో పాటుగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని ఉత్తర్వుల్లో జీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఆసరా, అమ్మఒడి, చేయూత, తోడు, పేదలందరికి ఇళ్లు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో క్షేత్రస్దాయిలో లబ్దిదార్లను గుర్తించడం, దానికి సంబంధించిన విధివిధానాలు అమలు చేయడంలో అలసత్వం వంటి కారణాలను గుర్తించినట్టు షోకాజ్​లో వివరించారు. గతంలోనూ ఇదే తరహాలో నోటీసులు ఇవ్వటంతో వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఉన్నతాధికారుల జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. జోనల్ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో సచివాలయ కార్యదర్శులు ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల విధులకు సంబంధించిన డైరీలతో సహా వ్యక్తిగతంగా జోనల్ కమిషనర్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.