'వైఎస్సార్సీపీ పాలనలో భద్రత లేదు- మహిళలను అన్ని విధాలా ఆదుకునే సత్తా టీడీపీకే ఉంది' - Guntur Women on TDP Supersix - GUNTUR WOMEN ON TDP SUPERSIX
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 5, 2024, 3:36 PM IST
Guntur Women on TDP Supersix Schemes: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకెళ్లాయి. ముఖ్యంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. దీంతో మహిళలకు భద్రత కావాలంటే బాబు రావాలని వారు కోరుకుంటున్నారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేసిన జగన్ తీరును ఎండగడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు తొలగించిన జగన్ సర్కారుపై మహిళలు మండిపడ్డారు. కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా మహిళలతో మా ప్రతినిధి ముఖాముఖి.
"అభివృద్ధి, సంక్షేమం సమానంగా కావాలంటే బాబు రావాలి. నవరత్నాల పేరుతో సీఎం జగన్ నవమోసాలు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు భద్రత లేదు. మహిళలను అన్ని విధాలుగా ఆదుకునే సత్తా టీడీపీకే ఉంది." - గుంటూరు మహిళలు