అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు: గుడివాడ అమర్నాథ్ - మంత్రి గుడివాడ అమర్నాథ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 9:30 AM IST

Gudivada Amarnath Likes to CM Jagan Trusted Pawn: సీఎం జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో అర్జునుడిగా పోరాడితే, తాను సైనికుడిగా ఉంటానని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తనకు మంత్రి పదవి కంటే, జగన్​కు నమ్మిన బంటుగా ఉండటమే ఇష్టమని తెలిపారు. అందరి తలరాత దేవుడు రాస్తే, తన తలరాత మాత్రం జగన్ రాస్తారని మంత్రి పేర్కొన్నారు. జగన్ కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమన్నారు. ఆయన్నిమళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువగా పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని అమరనాథ్ తెలిపారు.

రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని సీఎం జగన్ నాతో చెప్పారు. అందులో నాది సైనికుడి పాత్ర. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఎప్పుడూ ఉంటా. జగన్ తీసుకునే నిర్ణయాలు, పార్టీ అవసరాలకు నేను ఎప్పుడూ సిద్ధం. ఎవ్వరికీ ఏ విధమైన అనుమానాలు ఉండాల్సిన పనిలేదు. అందరి తలరాతలు దేవుడు రాస్తే నా తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు. మళ్లీ ఆయన్నీ అధికారంలోకి తీసుకురావటం కోసం కార్యకర్తలు అందరూ పని చేయాలి. -గుడివాడ అమర్నాథ్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.