తిరుమల ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు - భయాందోళనకు గురైన వాహనదారులు - Forest Elephants Roam in Tirumala
🎬 Watch Now: Feature Video
Elephants at Tirumala Ghat Road : తిరుమలలో అటవీ ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ఆర్చి వద్దకు సుమారు 12 ఏనుగులు గుంపుగా వచ్చాయి. ఆ మార్గంలో వెళ్లే వాహన చోదకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి వాటిని తిరిగి అడవిలోకి తరలించారు. దీంతో ఘాట్ రోడ్డులో వాహనాలను కొద్దిసేపు టీటీడీ (Tirumala Tirupati Devasthanam) సిబ్బంది నిలిపివేశారు.
శేషాచల అడవుల్లో ప్రతి ఏడాది ఇదే సమయంలో ఏనుగుల గుంపు సంచారం అధికంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. ఒక్కసారిగా రోడ్డుపై గజరాజులను చూసి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తత వల్ల పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కొద్ది సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పటికీ ఎటువంటి నష్టం జరగలేదు. ఏనుగులను అధికారులు సుకక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించినట్లు తెలిపారు.