మరో రూ. 4 వేల కోట్ల రుణం కోసం ఆర్‌బీఐ తలుపు తట్టిన వైఎస్సార్సీపీ - సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసమేనా! - YSRCP took Loans to Pay Bills - YSRCP TOOK LOANS TO PAY BILLS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 8:42 AM IST
Government Took Loans to Pay Bills to YSRCP Followers in AP : పదవీ కాలం ముగుస్తున్న దశలోనూ సొంతవారికి బిల్లుల చెల్లింపు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎడాపెడా రుణాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి మే 14 వరకు ఈ 44 రోజుల్లో 17 వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 4 వేల కోట్ల రూపాయలు అప్పు కోసం ఆర్‌బీఐ తలుపుతడుతోంది. కార్పొరేషన్ నుంచి చేసిన అప్పులు దీనికి అదనం. ఖనిజాభివృద్ధి సంస్థ నుంచే రూ.7 వేల కోట్ల రావాల్సి ఉంది.
నాబార్డు, ఎక్స్‌ట్సార్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు, ప్రత్యేక అసిస్టెన్స్ కింద కేంద్రం నుంచి వచ్చిన అప్పులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితరాల కింద పెద్ద మొత్తంలో నిధులు ఖజానాకు అందాయి. అవన్నీ అనుయాయులకు బిల్లుల రూపంలో చెల్లించేసింది. ఇప్పుడు 23 ఏళ్ల కాలానికి వెయ్యి కోట్లు, 22 ఏళ్ల కాలానికి వెయ్యి కోట్లు, 21 ఏళ్ల కాలానికి వెయ్యి కోట్లు, 16 ఏళ్లకు 500 కోట్లు, 9 ఏళ్లకు 500 కోట్లను రూపాయలను చెల్లించే పేరుతో రుణంగా తీసుకునేందుకు సెక్యూరిటీలను వేలం పెట్టింది.