మా బడి పరిస్థితి మారదా? - వరద నీటిలో పాఠశాలకు విద్యార్థులు - INAVOLU SCHOOL FLOODED DUE TO RAIN - INAVOLU SCHOOL FLOODED DUE TO RAIN
🎬 Watch Now: Feature Video
Published : Jul 9, 2024, 10:28 AM IST
School Flooded With Rainwater In Hanumakonda : గత రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాల చుట్టూ ప్రధాన మార్గంలో వరద నీరు చేరింది. పాఠశాలలోకి వెళ్లడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన గేటు వద్ద నీరు నిలిచి ఉండటంతో తరగతి గదుల్లోకి వెళ్లడానికి చిన్నారులు నానా అవస్థ పడ్డుతున్నారు. స్థానికులు దీన్ని గమనించి తమ ఫోన్లలో బంధించారు. 'మా గ్రామ ప్రభుత్వ పాఠశాల మారదా?' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అధ్వానంగా మారిన పాఠశాల పరిసరాలను చూసి అధికారుల తీరుపై మండిపడ్డారు.
కొండపర్తి గ్రామంలో ఇటీవల రహదారి పనులు జరిగాయి. ఈ పనులు చేసిన గుత్తేదారు కాల్వను పూడ్చి, రోడ్డు మధ్యలో చిన్న పైపులైన్ వేశారు. అందువల్ల వర్షం వస్తే ఆ వర్షానికి వచ్చిన చెత్త అడ్డుపడటంతో నీరు నిలిచిపోతుంది. దీంతో పాఠశాల మొత్తం వర్షపు నీటిలో మునిగిపోతుందని గ్రామస్థులు అంటున్నారు. అధికారులు ఈ అంశంపై చర్యలు చేపట్టాని కోరారు. గతంలో మాదిరిగా నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.