పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ప్రభుత్వం సౌకర్యాలు - ఆహారం అందజేత - Food Supply For People - FOOD SUPPLY FOR PEOPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 3:15 PM IST
Govt Providing Facilities to Flood People in Resettlement Centers: పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఉదయం పాలు, బిస్కెట్ ప్యాకెట్లతో పాటు టిఫిన్ అందజేసింది. మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందజేస్తున్నారు. గత మూడు రోజులుగా విజయవాడ పటమటలంక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, వీఎంసీ పాఠశాలలలో సుమారు 700 మంది పునరావాసం పొందుతున్నారు. వరద ప్రభావం తగ్గడంతో కొంతమంది ఇళ్లకు చేరుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఆహార సౌకర్యం కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు ఆహార పదార్థాలు అందజేస్తున్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ వాటర్ ట్యాంక్ సహకారంతో కరెంటు లేని ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సేవలు చేస్తున్నారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలను స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ముంపునకు గురై ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని బాధితులకు ప్రజాప్రతినిధులు ధైర్యం చెబుతున్నారు. రెండు రోజులుగా పునరావాస కేంద్రంలోనే ఉన్నామంటున్న బాధితులు సర్వం కోల్పోయామని చెబుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు.