'చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు' - కూటమికే మా మద్దతు : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నేతలు - pensioners supported to alliance - PENSIONERS SUPPORTED TO ALLIANCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 8:31 PM IST
Government Pensioners Supported to Alliance Leaders : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కూటమి నేతలకు విశేషంగా మద్దతు లభిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సంఘం రాష్ట్ర నాయకులు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేదని తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్లకు చెల్లించాల్సిన మెుత్తాలను సకాలంలో చెల్లించే వారని గుర్తుచేశారు.
కానీ, ప్రస్తుత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వెల్లడించారు.పెన్షనర్లు తమకు రావలసిన మెుత్తాన్ని సైతం తీసుకునే అవకాశం లేకుండా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు, పెన్షనర్లకు తగిన న్యాయం చేస్తామని రాధాకృష్ణ హామి ఇచ్చారు.