బీసీ కులగణన ప్రక్రియ పొడిగింపు- 12 తేదీకి పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ

🎬 Watch Now: Feature Video

thumbnail

Government Issued Orders Extending Process of BC Caste Survey: రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కులగణన ప్రక్రియను ఈనెల 12 తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రణాళిక విభాగం కార్యదర్శి గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కులగణన ప్రక్రియ చాలా చోట్ల 90 శాతానికి కూడా చేరుకోకపోవడంతో గడువు పెంచారు. 12 తేదీ నాటికి ప్రక్రియను ముగించాలని గ్రామ, వార్డు సచివాలయం శాఖను ప్రభుత్వం ఆదేశించింది. సర్వే ప్రక్రియలో మిగిలిపోయిన వారికి ఈనెల 17 వరకూ సచివాలయంలో నమోదు చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 24 తేదీ నాటికి కులగణన నివేదికకు తుది రూపం ఇవ్వాలని గ్రామ, వార్డు సచివాలయం శాఖను ఆదేశించారు. 

మరో వైపు జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు కులగణన సర్వేని పరిశీలించి వాటిని సీఎం డ్యాష్ బోర్డుకు పంపాల్సి ఉంటుంది. ఈనెల 7వ తేదీకి కులగణన సర్వే పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించడంతో జిల్లా అధికారులు మంగళవారం ఆన్​లైన్​లో తమ పరిధిలోని కుటుంబాలకు సంబంధించి కులాల వారీగా వివరాలు పరిశీలించారు. మండల తహసీల్దార్లు సూచించిన కులాలను పరిగణనలోకి తీసుకుని ఆన్​లైన్​లో అప్లోడ్ చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.