ఓపీ చీటీల్లో జగన్ ఫొటో- తొలగించని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ - Patients OP Sheets With Jagan Photo
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 9:48 AM IST
Government Hospitals Giving OP Sheets With Jagan Photo to Patients: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇంకా సీఎం జగన్కు భజన చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇంకా జగన్ చిత్రాలతో ఉన్న ఓపీ చీటీలను ఇస్తున్నారు. విజయవాడలోని జీజీహెచ్‌లో మంగళవారం రోగులకు అందజేసిన చీటీల్లో జగన్ ఫొటోలున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆ చీటీలపై ఏ పార్టీకి చెందిన వారి ఫొటో కూడా ఉండకూడదు.
విజయవాడ పాత ఆసుపత్రిలో 2018లో టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన తల్లీబిడ్డల ఆరోగ్య కేంద్రం అదనపు గదుల శిలాఫలకాన్ని అధికారులు కప్పేశారు. దాని పక్కనే ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనుల శిలాఫలకాన్ని అలాగే వదిలేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే రోగులకు సీఎం జగన్ చిత్రం ఉన్న చేతి సంచులు, ఫోల్డర్లను ఇవ్వొద్దని జిల్లాలకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ చేతి సంచులు, ఫోల్డర్ల తయారీకి వైద్య ఆరోగ్య శాఖ భారీగా ఖర్చుపెట్టింది.