రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి గొట్టిపాటి - Gottipati Took Charge as Minister

🎬 Watch Now: Feature Video

thumbnail

Gottipati Took Charge as Minister in AP : రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏపీ సచివాలయంలో ఇంధనశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ కరెంట్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే కార్యక్రమానికి సంబంధించిన దస్త్రంపై మూడో సంతకం చేసినట్లు గొట్టిపాటి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్​లోని ప్రజలకు మెరుగైన రీతిలో కరెంట్​ను అందించేందుకు, విద్యుత్ సరఫరా డిమాండ్​లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ సంస్కరణలను మొదటిగా ప్రారంభించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. దేశంలోనే ఉత్తమంగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వం ఈ శాఖను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.