ఖమ్మం జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు - మధ్యాహ్నం నుంచి రాకపోకలు ప్రారంభం - train derailed in patharlapadu
🎬 Watch Now: Feature Video
Published : Feb 17, 2024, 12:25 PM IST
|Updated : Feb 17, 2024, 3:02 PM IST
Goods Train Derailed in Khammam : ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో గూడ్సు రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. ఒక కిలోమీటర్ మేర రైలు కట్టకు అనుసంధానంగా ఉన్న స్వీపర్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. పునరుద్ధరణ పనులను రైల్వే అధికారులు హుటాహుటిన చేపట్టారు.
Kazipet Vijayawada Rail Route Cleared : విజయవాడ, కాజీపేట నుంచి వచ్చిన రైల్వే సాంకేతిక సిబ్బంది శ్రమించి పట్టాలు తప్పిన బోగీని పక్కకు తొలగించారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు మరమ్మతులు పూర్తి కావడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. మొదటగా తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. నాణ్యతా లోపమా, సిబ్బంది నిర్లక్ష్యమా అన్న కోణంలో పలువురిని ప్రశ్నిస్తున్నారు.