అయ్యో పాపం - హనుమకొండలో తాటిచెట్టుపైనే ప్రాణాలొదిలిన గీత కార్మికుడు - Gita worker died on a tree - GITA WORKER DIED ON A TREE
🎬 Watch Now: Feature Video


Published : Jun 23, 2024, 4:42 PM IST
Gita worker died on a tree in Hanmaknda : చెట్టు ఎక్కేందుకు వినియోగించే మోకు జారడంతో ప్రమాదవశాత్తు గీత కార్మికుడు తాటి చెట్టుపైనే మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ఐనవోలు మండలం లింగమోరి గూడెంనకు చెందిన బుర్ర సత్తయ్య గౌడ్ అనే వ్యక్తి గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజులాగే ఇవాళ కూడా బుర్ర సత్తయ్య గౌడ్ కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు.
తాటి చెట్టు ఎక్కే క్రమంలో అకస్మాత్తుగా మోకు జారడంతో చెట్టుపైనే సుమారు రెండు గంటల పాటు తలకిందులుగా వేలాడాడు. చెట్టుపైన ప్రాణభయంతో ఆర్తనాదాలు చేశాడు. అది విన్న స్థానికులు రక్షించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, అతన్ని రక్షించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఇంటిని పోషించే పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లింగమోరిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.