కనుల పండువగా గంధ మహోత్సవం- భారీగా తరలివచ్చిన భక్తులు - rottela panduga - ROTTELA PANDUGA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 12:13 PM IST
Gandha Mahotsavam Celebrations in Nellore Rottela Panduga : నెల్లూరు బారాషాహీద్ దర్గా గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధ మహోత్సవాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలలలో గంధాన్ని ఊరేగింపుగా బారాషాహిద్ దర్గా వరకు తీసుకువచ్చారు. అమీనియా మసీదు వద్ద గంధం కలిపే కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. గంధం ఊరేగింపుగా ఈద్గా వద్దకు చేరుకోగా, అక్కడ ఫకీర్ల విన్యాసాల అనంతరం దర్గాలోకి తీసుకువెళ్లారు. గంధమహోత్సవానికి విచ్చేసిన కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రంధాన్ని బారాషాహిద్ సమాధులకు లేపనంగా వేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు.
మతాలకు అతీతంగా జరుపుకొనే ఈ పండగకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. కోరిన కోర్కెలు తీరుతున్నాయని, అందుకే మళ్లీ వచ్చామంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపైనా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఎక్కెడెక్కడ నుంచో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. మరో రెండు రోజులపాటు ఈ పండుగ కొనసాగనుంది.