ఉప్పల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ వివాదం - ప్రయాణికులు, మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం - Free Parking Issue At Uppal Metro - FREE PARKING ISSUE AT UPPAL METRO
🎬 Watch Now: Feature Video
Published : Aug 14, 2024, 3:58 PM IST
Free Parking Issue At Uppal Metro Station : హైదరాబాద్ ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ప్రయాణికులు, మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మెట్రోరైలు టికెట్ ధరలు పెంచి, ఇప్పుడు పార్కింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఫ్రీ పార్కింగ్ ఇచ్చే విధంగా చూడాలని మెట్రో వినియోగదారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
హైదరాబాద్‌కే మెట్రో రైలు తలమానికమైనది. మెట్రో ద్వారా నిత్యం వేలాది మంది వారి ఉద్యోగాలకు, ఉపాధి నిమిత్తం ప్రయాణాలు సాగిస్తుంటారు. మెట్రోరైలు ఇప్పటికే ఎన్నోమైలురాళ్లు దాటింది, ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.703.20 కోట్లు ఆదాయం రాగా 2023-24లో 1407.81 కోట్లకు పెరిగింది.