'మానవ సేవే మాధవ సేవ' - ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలి : వెంకయ్య నాయుడు - Foot Camp program in nellore dist
🎬 Watch Now: Feature Video
Venkaiah Naidu Participated in Jaipur Foot Camp Program : ప్రతి వ్యక్తి సమాజ సేవ చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఏర్పాటు చేసిన ఉచిత జైపూర్ ఫుట్ క్యాంప్‌లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్, భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయ సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని, అలాగే కొంత సమయాన్ని సమాజ సేవ కోసం కేటాయించాలన్నారు. మనం సంపాదించిన ధనంలో కొద్ది భాగామైన పేదవారికి సాయం చేసినప్పుడే ఆ సంపాదనకు విలువ ఉంటుదని తెలిపారు.
సమాజంలో చాలా మంది పేదలు, వికలాంగులు ఉన్నారని వారిని చిన్నచూపు చూడకుండా సాయం చేయాలని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పినట్లు గుర్తుచేశారు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే అని తెలిపారు. ప్రతి ఒక్కరికి సేవ జీవితంలో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి పాల్కొన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు జరుగుతుందని తెలిపారు. కావున వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలు కోరారు.